Nasha Mukt Bharat: మెగాస్టార్ చిరంజీవి కీలక పిలుపు.. డ్రగ్స్‌పై పోరాటానికి సంపూర్ణ మద్దతు

హైదరాబాద్: మాదకద్రవ్యాల మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి మెగాస్టార్ చిరంజీవి తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. డ్రగ్స్ రహిత భారతదేశం నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు సమాజంలోని అన్ని వర్గాలు కలిసికట్టుగా పోరాడాలని ఆయన సూచించారు. హైదరాబాద్ వేదికగా నవంబర్ 25 నుంచి 27 వరకు 'నషా ముక్త్ భారత్ యాత్ర' కొనసాగుతోంది. దేశాన్ని మాదకద్రవ్యాల రహితంగా మార్చాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి చిరంజీవి సంపూర్ణ...