STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 26 November 2026, 1:26 pm Posted by : ARUN

Nasha Mukt Bharat: మెగాస్టార్ చిరంజీవి కీలక పిలుపు.. డ్రగ్స్‌పై పోరాటానికి సంపూర్ణ మద్దతు

హైదరాబాద్: మాదకద్రవ్యాల మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి మెగాస్టార్ చిరంజీవి తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. డ్రగ్స్ రహిత భారతదేశం నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు సమాజంలోని అన్ని వర్గాలు కలిసికట్టుగా పోరాడాలని ఆయన సూచించారు.

హైదరాబాద్ వేదికగా నవంబర్ 25 నుంచి 27 వరకు ‘నషా ముక్త్ భారత్ యాత్ర’ కొనసాగుతోంది. దేశాన్ని మాదకద్రవ్యాల రహితంగా మార్చాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి చిరంజీవి సంపూర్ణ మద్దతు తెలిపారు. డ్రగ్స్ వినియోగం యువత జీవితాలను, వారి భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేస్తోందని పేర్కొంటూ, ఈ మహమ్మారిని సమాజం నుంచి తరిమికొట్టాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మెగాస్టార్ కోరారు. యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడటం అందరి బాధ్యత అని స్పష్టం చేశారు. మాదకద్రవ్య రహిత భారతదేశం కోసం మనమందరం ఐక్యంగా నిలబడాలని చిరంజీవి పిలుపునివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.