Lord Hanuman: దేశంలోని ప్రముఖ హనుమాన్ ఆలయాలు… ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, విశిష్టతలు ఇవే!
సనాతన ధర్మంలో అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించబడే దేవుళ్లలో ఆంజనేయస్వామి ఒకరు. అపారమైన భక్తి, బలం, ధైర్యం, వినయం, నిస్వార్థ సేవకు ఆయన ప్రతిరూపంగా నిలుస్తారు. రామాయణంలో శ్రీరాముడిపై హనుమంతుడికి ఉన్న అచంచలమైన భక్తి, విశ్వాసం కోట్లాది మందికి స్ఫూర్తినిస్తున్నాయి. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ప్రసిద్ధ హనుమాన్ ఆలయాలు భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రాలుగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మంగళ, శనివారాల్లో వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని హనుమాన్ చాలీసా పారాయణం చేస్తారు. అయోధ్య హనుమాన్ గఢీ ఆలయం: ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఉన్న ఈ పురాతన ఆలయం...