Hyderabad: స్నాప్‌చాట్‌లో పరిచయం.. రూ.5 లక్షల కోసం!
సోషల్ మీడియా వేదికగా పరిచయం పెంచుకుని, ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించిన ఓ యువకుడు యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా ఆమెకు సంబంధించిన నగ్న వీడియోలను వైరల్ చేస్తానని బెదిరిస్తూ రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. కత్తితో బెదిరించి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల యువతి ప్రస్తుతం హైదరాబాద్‌లోని అత్తాపూర్ పరిధి శివనగర్ కాలనీలో నివసిస్తోంది. స్వయం ఉపాధి...