WhatsApp Web: మీ అకౌంట్ సురక్షితంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరిగిన నేపథ్యంలో వాట్సాప్ మన రోజువారీ జీవితంలో కీలకంగా మారింది. ముఖ్యంగా కంప్యూటర్లో పనిచేసే వారు వాట్సాప్ వెబ్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీనివల్ల కంప్యూటర్ నుంచే మెసేజ్‌లు పంపడం, ఫొటోలు, వీడియోలు షేర్ చేయడం సులభంగా మారింది. అయితే వాట్సాప్ వెబ్‌ను ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే వ్యక్తిగత సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని సైబర్ భద్రతా విభాగం హెచ్చరిస్తోంది. ఇటీవల ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) పరిధిలోని నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్...