Flipkart: ఫ్లిప్కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి రాజీనామా.. త్వరలో రానున్న కొత్త సీఈవో!
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్లో కీలక నాయకత్వ మార్పు చోటుచేసుకోనుంది. సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) కల్యాణ్ కృష్ణమూర్తి తన పదవి నుంచి వైదొలగనున్నారు. కంపెనీలో 11 ఏళ్లకు పైగా పనిచేసిన అనంతరం తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు ఫ్లిప్కార్ట్ బుధవారం ప్రకటించింది. ఆయన స్థానంలో కొత్త సీఈఓను రానున్న కొన్ని వారాల్లో ప్రకటించనున్నట్లు వెల్లడించింది. కల్యాణ్ కృష్ణమూర్తి వైదొలగే నేపథ్యంలో తాత్కాలికంగా సంస్థ నిర్వహణ బాధ్యతలను చీఫ్ ప్రొడక్ట్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్ బాలాజీ త్యాగరాజన్, ఫ్లిప్కార్ట్ బోర్డు చేపట్టనున్నాయి. కొత్త...