Wardhannapet: ఇద్దరు చిన్నారులకు అండగా వర్ధన్నపేట ఎస్సై ప్రవీణ్
వర్ధన్నపేట: విధి నిర్వహణలోనే కాకుండా ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ వర్ధన్నపేట ఎస్సై బి. ప్రవీణ్ మానవత్వాన్ని చాటుకున్నారు. తండ్రిని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న ఇద్దరు చిన్నారుల భవిష్యత్తుకు తన వంతు సహాయం అందించారు. బాధిత కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న ఆయన రూ.20 వేల ఆర్థిక సాయం చేసి ఉదారతను చాటుకున్నారు. వర్ధన్నపేట పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన ఒంగూరి శ్రీకాంత్ ఇటీవల కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు. దీంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ముఖ్యంగా...