Stock Market Crash: స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం.. ఒక్కరోజే లక్షల కోట్ల సంపద ఆవిరి!

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలను చవిచూశాయి. వరుసగా నాలుగు వారాల పాటు లాభాలతో దూసుకెళ్లిన మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ సూచీలు 1 శాతానికి పైగా పడిపోయాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, మెటల్ రంగాల షేర్లలో భారీ అమ్మకాలు జరగడం మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. మధ్యాహ్నం 1.27 గంటల సమయానికి సెన్సెక్స్ 1,159 పాయింట్లు (1.38 శాతం) నష్టపోయి 82,760.74 వద్ద ట్రేడయింది. నిఫ్టీ 50...