Tirupathi Reddy: తరగతి గది నుండి ప్రజా క్షేత్రంలోకి…ప్రజాసేవలో ఏకశిల తిరుపతి రెడ్డి నూతన అధ్యాయం

రెండున్నర దశాబ్దాలుగా ఉమ్మడి వరంగల్ ప్రాంతంలో విద్యా వికాసానికి వెన్నెముకగా నిలిచిన వ్యక్తి ఏకశిల తిరుపతి రెడ్డి. ఏకశిల విద్యాసంస్థల ఛైర్మన్‌గా ఎందరో విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన ఆయన ఇప్పుడు తన సామాజిక సేవా దృక్పథాన్ని మరింత విస్తృత స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలో చేరడం ద్వారా ఆయన క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన తిరుపతి రెడ్డి... ప్రయాణం కృషి, పట్టుదల మరియు దూరదృష్టికి నిదర్శనం. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం...