Samsung Galaxy SmartTag3: అదిరే ఫీచర్..ఇకపై మీ వస్తువులు ఎక్కడున్నా ఇట్టే గుర్తించొచ్చు!

వస్తువులు ఎక్కడ పెట్టామో మర్చిపోతున్నారా? ఇంట్లోనో, బయటో కీలకమైన వస్తువులు కనిపించకుండా పోతున్నాయా? ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా శాంసంగ్ సరికొత్త ట్రాకింగ్ పరికరం Galaxy SmartTag3ను పరిచయం చేసింది. స్మార్ట్ థింగ్స్ యాప్‌తో అనుసంధానమయ్యే ఈ పరికరం ద్వారా బ్యాగులు, సూట్‌కేసులు, సైకిళ్లు, పెంపుడు జంతువులు వంటి వాటి ఆచూకీని మరింత కచ్చితంగా తెలుసుకోవచ్చు. మెరుగైన లొకేషన్ టెక్నాలజీ, స్మార్ట్ హోమ్ ఫీచర్లతో ఇది వినియోగదారులకు ఉపయోగపడనుంది. గెలాక్సీ స్మార్ట్ ట్యాగ్3లో అందించిన ప్రధాన ఫీచర్ Compass View. Bluetooth 6.0 Channel Sounding...