Nepal PM: నేపాల్ ప్రధాని బాలేంద్ర షాకు ఘన స్వాగతం.. మోదీతో కీలక భేటీ!

నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా భారత పర్యటనలో భాగంగా సోమవారం దేశ రాజధాని న్యూఢిల్లీలో ఘన స్వాగతం లభించింది. రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన ప్రత్యేక స్వాగత కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలేంద్ర షాకు గౌరవ వందనం (గార్డ్ ఆఫ్ ఆనర్) సమర్పించారు. రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా ఆయన భారత్‌కు వచ్చారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగుతోంది. బాలేంద్ర షా సోమవారం ప్రధాని నరేంద్ర...