KTR: కాంగ్రెస్‌కు మిగిలింది 500 రోజులు మాత్రమే..కేసీఆరే మళ్లీ సీఎం!

వరంగల్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందని మరో 500 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. 2028లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. హనుమకొండలోని కేడీసీ గ్రౌండ్‌లో నిర్వహించిన జన చైతన్య సభలో ఆయన పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఏకశిలా విద్యాసంస్థల అధినేత గౌరు తిరుపతిరెడ్డి తన అనుచరులు, వివిధ రంగాలకు చెందిన మేధావులతో కలిసి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరగా...