Karimnagar: కరీంనగర్‌లో నితిన్ నబీన్ పాదయాత్ర..రాహుల్‌ చెప్పెవన్ని అబద్దాలే అన్న బీజేపీ చీఫ్

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కరీంనగర్‌లో నిర్వహించిన పాదయాత్రలో పాల్గొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. అరాచకాన్ని అంతం చేయండి నినాదంతో బీజేపీ చేపట్టిన దేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగా ఈ పాదయాత్ర నిర్వహించారు. కరీంనగర్‌లోని వైశ్య భవన్ సమీపంలో నిర్వహించిన బహిరంగ సభలో నితిన్ నబీన్ ప్రసంగించారు. అనంతరం పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన నితిన్ నబీన్.. దేశంలో ఓట్ల చోరీ జరుగుతోందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. ప్రజలు,...