Jagadish Reddy: డిసెంబర్ 10న ‘నల్గొండ నగారా’..సాగర్ జలదోపిడీపై బీఆర్ఎస్ పోరుబాట
నాగార్జున సాగర్ వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న అక్రమ ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ మరో పోరాటానికి సిద్ధమైంది. ఈ ప్రాజెక్టుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు ఇవ్వడాన్ని నిరసిస్తూ డిసెంబర్ 10వ తేదీన నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ నాయకులు ప్రకటించారు. నల్గొండ నగారా పేరుతో రైతులతో ఈ సభను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇదే అంశంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ, మహబూబ్నగర్, హైదరాబాద్,...