Tourism Guide: దోమలు లేని రిసార్ట్.. ప్రకృతి అందాల మధ్య హాయిగా విహారం!
స్వర్గధామంలాంటి పర్యాటక ప్రాంతంలోనూ దోమల బెడద ఉంటే విహారయాత్రకు ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా సాయంత్రం వేళ బీచ్‌లలో, స్విమ్మింగ్ పూల్స్ దగ్గర లేదా ఆరుబయట భోజనం చేసే సమయంలో దోమలు పర్యాటకులను ఇబ్బంది పెడుతుంటాయి. అయితే కరేబియన్ దీవుల్లోని ఓ లగ్జరీ రిసార్ట్ మాత్రం ఈ సమస్యకు వినూత్న పరిష్కారం చూపించింది. రసాయన మందులు పిచికారీ చేయకుండానే దోమల సంఖ్యను దాదాపు పూర్తిగా తగ్గించి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లోని వర్జిన్ గోర్డా ద్వీపం తూర్పు ప్రాంతంలో ఉన్న ఆయిల్...