Kodangal: నూతన వధూవరులను ఆశీర్వదించిన రాజ ప్రభాకర్

కొత్తపల్లి మండలం భూనిడ్ గ్రామానికి చెందిన సుధాకర్ రెడ్డి అన్న కుమార్తె వివాహ వేడుక మద్దూర్ మండల కేంద్రంలోని గ్రీన్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్‌లో అత్యంత వైభవంగా బంధుమిత్రుల సమక్షంలో జరిగింది. ఈ శుభకార్యానికి తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) కొడంగల్ నియోజకవర్గ ఇన్‌చార్జి రాజ ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేడుకకు విచ్చేసిన రాజ ప్రభాకర్‌కు సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన నూతన వధూవరులను కలిసి పుష్పగుచ్ఛం అందించి ఆశీర్వదించారు. దాంపత్య జీవితంలోకి అడుగుపెడుతున్న నూతన...