Kodangal: రేవంత్ సర్కార్‌పై దివ్యాంగుల పోరుబాట..రాజా ప్రభాకర్ మద్దతు!
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు గడుస్తున్నా వికలాంగులకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు పోతురాజు సుధీర్ విమర్శించారు. వికలాంగుల సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌తో కోస్గి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం వరకు పాదయాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు నెలకు రూ.6...