తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు గడుస్తున్నా వికలాంగులకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు పోతురాజు సుధీర్ విమర్శించారు. వికలాంగుల సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌తో కోస్గి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం వరకు పాదయాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు నెలకు రూ.6 వేల పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. వృద్ధులు, గీత కార్మికులు, వితంతువులతో పాటు అన్ని వర్గాల పెన్షన్లను రెట్టింపు చేస్తామని ప్రకటించిందన్నారు. అలాగే రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సుల్లో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు మహిళా, శిశు సంక్షేమ శాఖలో విలీనమైన వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారని చెప్పారు.
రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ తరహాలో తెలంగాణలోనూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ అభయహస్తం మేనిఫెస్టోలోని 29వ అంశంలో హామీ ఇచ్చిందన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీల్లో ఒక్కదానిని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు. వికలాంగుల సంక్షేమం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో రజిని అనే వికలాంగురాలికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించినట్లు ప్రచారం చేసుకుందని, కానీ వాస్తవానికి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగం మాత్రమే ఇచ్చి వికలాంగుల సమాజాన్ని మోసం చేసిందని విమర్శించారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల రంగంలో వికలాంగులకు ప్రత్యేక రిజర్వేషన్లు ఉండేవని, వాటిని కూడా ప్రస్తుత ప్రభుత్వం తొలగించిందని ఆరోపించారు. 14 ఏళ్లుగా వికలాంగుల హక్కుల కోసం పోరాడుతున్నప్పటికీ పాలకులు తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది వికలాంగులు ఉన్నారని, వారి సమస్యలను చట్టసభల్లో ప్రస్తావించే ప్రజాప్రతినిధులు కరువయ్యారని అన్నారు. ఈ నేపథ్యంలో తాము చేపట్టిన పాదయాత్రకు తెలంగాణ రక్షణ సేన పార్టీ మద్దతు ప్రకటించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ నేత రాజా ప్రభాకర్ తమకు అండగా నిలవడంపై ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కవిత నాయకత్వంలోని తెలంగాణ రక్షణ సేన… వికలాంగుల హక్కుల సాధన కోసం పార్టీలకు అతీతంగా పోరాటం చేస్తామని హామీ ఇచ్చిందని వెల్లడించారు. రాజా ప్రభాకర్ వికలాంగుల సమస్యలపై స్పందించి వారి పోరాటానికి మద్దతు ప్రకటించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులోనూ తమకు అండగా నిలవాలని కోరారు.
వచ్చే ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి రాజా ప్రభాకర్‌ను అసెంబ్లీకి పంపేందుకు వికలాంగుల సమాజం ఐక్యంగా కృషి చేస్తుందని వారు ప్రకటించారు. వికలాంగుల సమస్యలను పరిష్కరించే నాయకత్వానికి మద్దతుగా నిలుస్తామని స్పష్టం చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని, పాదయాత్ర ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని హెచ్చరించారు.
{"type":"video","tracklist":true,"tracknumbers":true,"images":true,"artists":true,"tracks":[{"src":"https://startrinethram.com/wp-content/uploads/2026/11/WhatsApp-Video-2026-11-22-at-18.20.37.mp4","type":"video/mp4","title":"WhatsApp Video 2026-11-22 at 18.20.37","caption":"","description":"","meta":{"length_formatted":"5:15"},"dimensions":{"original":{"width":848,"height":478},"resized":{"width":674,"height":380}},"image":{"src":"https://startrinethram.com/wp-includes/images/media/video.svg","width":48,"height":64},"thumb":{"src":"https://startrinethram.com/wp-includes/images/media/video.svg","width":48,"height":64}}]}