Jabardasth: జబర్దస్త్ ఆర్టిస్టులు దొరబాబు, రైజింగ్ రాజుకు రోడ్డు ప్రమాదం.. కారు నుజ్జునుజ్జు!

జబర్దస్త్ కామెడీ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ ఆర్టిస్టులు దొరబాబు, రైజింగ్ రాజుకు రోడ్డు ప్రమాదం జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలోని పాలకోడేరు మండలం గోరగనమూడి వద్ద అర్ధరాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో దొరబాబు, రైజింగ్ రాజుతో పాటు కారు డ్రైవర్‌కు గాయాలయ్యాయి. కాకినాడలో జనసేన అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అనంతరం దొరబాబు, రైజింగ్ రాజు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం...