Iran-US War: అమెరికా రాడార్లపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడి!

ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. తాజాగా బహ్రెయిన్‌లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ముఖ్యంగా అమెరికా రక్షణ వ్యవస్థలో కీలకమైన పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ రాడార్లను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) వెల్లడించింది. ఈ పరిణామం గల్ఫ్ ప్రాంతంలో మరోసారి యుద్ధ భయాలను పెంచుతోంది. ఇరాన్ ప్రభుత్వ మీడియా IRIB ప్రసారం చేసిన ప్రకటన ప్రకారం.. ఐఆర్‌జీసీ ఏరోస్పేస్ ఫోర్స్ బహ్రెయిన్‌లోని అల్ రిఫా ,...