- ఆపదలో ఉన్న పేద కుటుంబానికి నేనున్నానంటూ భరోసా ఇచ్చిన రాజ ప్రభాకర్
- కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన మానవత్వం
స్టార్ త్రినేత్రం, కొడంగల్: కన్నీళ్లతో సాయం కోసం ఎదురుచూస్తున్న ఓ పేద కుటుంబానికి టిఆర్ఎస్ పార్టీ కొడంగల్ నియోజకవర్గం ఇంచార్జ్ రాజ ప్రభాకర్ అండగా నిలిచారు. కొడంగల్ నియోజకవర్గం కోస్గి మండలం పీసీ తండాకు చెందిన బుజ్జిబాయి అనారోగ్యంతో చికిత్స పొందేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ రాజా ప్రభాకర్ ను ఆశ్రయించారు.
విషయం తెలుసుకున్న ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే స్పందించారు. రాజ ప్రభాకర్ యువసేన బృందాన్ని ఆసుపత్రికి పంపించి, చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయం అందిస్తూ బుజ్జిబాయికి వైద్యం చేయించారు.

ఆపదలో ఉన్న సమయంలో పలకరించే మనసు, ఆదుకునే చేయి ఎంతో విలువైనవని ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది. తమ కష్టకాలంలో అండగా నిలిచి, చికిత్సకు సహకరించిన రాజా ప్రభాకర్ కు బుజ్జిబాయి కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
{"type":"video","tracklist":true,"tracknumbers":true,"images":true,"artists":true,"tracks":[{"src":"https://startrinethram.com/wp-content/uploads/2026/11/WhatsApp-Video-2026-11-21-at-14.30.52.mp4","type":"video/mp4","title":"WhatsApp Video 2026-11-21 at 14.30.52","caption":"","description":"","meta":{"length_formatted":"0:31"},"dimensions":{"original":{"width":464,"height":832},"resized":{"width":674,"height":1209}},"image":{"src":"https://startrinethram.com/wp-includes/images/media/video.svg","width":48,"height":64},"thumb":{"src":"https://startrinethram.com/wp-includes/images/media/video.svg","width":48,"height":64}}]}