Raja Prabhakar: మెడికుంట తండాలో టీఆర్ఎస్ జోరు.. భారీగా చేరికలు, గ్రామ కమిటీ ఎన్నిక
కొడంగల్: మద్దూర్ మండలం మెడికుంట తండా గ్రామంలో ‘తెలంగాణ రక్షణ సేన’ (టీఆర్ఎస్) పార్టీ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో చేరికల కార్యక్రమం నిర్వహించారు. కొడంగల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజ ప్రభాకర్ నేతృత్వంలో జరిగిన ఈ సభకు గ్రామస్థులు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చారు. పలువురు స్థానిక నాయకులు, గ్రామస్థులు పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై రాజ ప్రభాకర్ సమక్షంలో తెలంగాణ రక్షణ సేన కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన నూతన సభ్యులను ఆయన సాదరంగా ఆహ్వానించారు. చేరికల ప్రక్రియ ముగిసిన అనంతరం గ్రామ స్థాయిలో పార్టీ...