Raja Prabhakar: కొడంగల్‌లో బీఆర్ఎస్‌కు షాక్.. కవితక్క సమక్షంలో టీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు
కొడంగల్ నియోజకవర్గ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవితక్క నేతృత్వంలో కొడంగల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి రాజ ప్రభాకర్ ఆధ్వర్యంలో మద్దూరు, బొమ్మరాస్‌పేట మండలాలకు చెందిన పలువురు యువనేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో టీఆర్ఎస్‌లో చేరారు. ముఖ్యంగా మద్దూరు మండలం నుండి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రముఖ యువనేత నవాజ్‌తో పాటు సద్దాం, ఖాసీం తమ అనుచరులతో కలిసి గులాబీ పార్టీని వీడి కవితక్క సమక్షంలో తెలంగాణ రక్షణ సేన కండువా కప్పుకున్నారు. అదేవిధంగా బొమ్మరాస్‌పేట మండలం నుండి...