STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 21 November 2026, 2:53 pm Posted by : ARUN

Raja Prabhakar: కొడంగల్‌లో బీఆర్ఎస్‌కు షాక్.. కవితక్క సమక్షంలో టీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు

కొడంగల్ నియోజకవర్గ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవితక్క నేతృత్వంలో కొడంగల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి రాజ ప్రభాకర్ ఆధ్వర్యంలో మద్దూరు, బొమ్మరాస్‌పేట మండలాలకు చెందిన పలువురు యువనేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో టీఆర్ఎస్‌లో చేరారు.

ముఖ్యంగా మద్దూరు మండలం నుండి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రముఖ యువనేత నవాజ్‌తో పాటు సద్దాం, ఖాసీం తమ అనుచరులతో కలిసి గులాబీ పార్టీని వీడి కవితక్క సమక్షంలో తెలంగాణ రక్షణ సేన కండువా కప్పుకున్నారు. అదేవిధంగా బొమ్మరాస్‌పేట మండలం నుండి విజయ్, రమేష్, అజయ్, కేస్యనాయక్ సహా పలువురు యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారందరికీ కల్వకుంట్ల కవితక్క పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. టీఆర్ఎస్‌లోకి వరుస చేరికల నేపథ్యంలో కొడంగల్ ఇంఛార్జీ రాజ ప్రభాకర్‌ను ప్రత్యేకంగా అభినందించారు కవిత.

కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు, బొమ్మరాస్‌పేట మండలాల నుండి ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చి, ‘తెలంగాణ రక్షణ సేన’ కుటుంబంలోకి చేరుతున్న యువ సోదరులందరికీ హృదయపూర్వక స్వాగతం పలికారు కవిత. ఎంతోమంది ఉత్సాహవంతులైన యువకులు మన పార్టీ జెండా పట్టుకోవడం ఎంతో ఆనందాన్ని, కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది అని తెలిపారు.

తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి, సామాన్యుల హక్కుల కోసం పోరాడటానికి మనం ‘తెలంగాణ రక్షణ సేన’ను ఏర్పాటు చేసుకున్నాం అన్నారు. నేడు రాష్ట్రంలో ఏ వర్గం చూసినా అన్యాయానికి ..ముఖ్యంగా కొడంగల్ లాంటి వెనుకబడిన ప్రాంతాల్లో యువతకు ఉపాధి లేక, రైతులకు సరైన భరోసా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అన్నారు.

మద్దూరు, బొమ్మరాస్‌పేట మండలాల్లోని ప్రతి గడపకూ మన పార్టీ ఆశయాలను తీసుకెళ్లాలి అని పిలుపునిచ్చారు. ప్రజల కష్టసుఖాల్లో తోడుగా ఉంటూ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలని..రాబోయే రోజుల్లో కొడంగల్ గడ్డపై తెలంగాణ రక్షణ సేన జెండా రెపరెపలాడటం ఖాయం అని జోస్యం చెప్పారు.

  1. WhatsApp Video 2026-11-21 at 14.30.41 (1)


{"type":"video","tracklist":true,"tracknumbers":true,"images":true,"artists":true,"tracks":[{"src":"https://startrinethram.com/wp-content/uploads/2026/11/WhatsApp-Video-2026-11-21-at-14.30.41-1.mp4","type":"video/mp4","title":"WhatsApp Video 2026-11-21 at 14.30.41 (1)","caption":"","description":"","meta":{"length_formatted":"1:05"},"dimensions":{"original":{"width":848,"height":478},"resized":{"width":674,"height":380}},"image":{"src":"https://startrinethram.com/wp-includes/images/media/video.svg","width":48,"height":64},"thumb":{"src":"https://startrinethram.com/wp-includes/images/media/video.svg","width":48,"height":64}}]}