Railway Kodur: ఈవ్ టీజింగ్ ఘటనపై లోకేశ్ సీరియస్..నిందితులపై కఠిన చర్యలకు ఆదేశం!

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో బాలికల పాఠశాల విద్యార్థినులు ఎదుర్కొంటున్న ఈవ్ టీజింగ్ సమస్యపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. పాఠశాలకు వెళ్లే సమయంలో కొందరు ఆకతాయిలు వేధింపులకు పాల్పడుతున్నారంటూ విద్యార్థినులు చేసిన ఫిర్యాదులపై ఆయన తీవ్రంగా స్పందించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, పోలీసు అధికారులను ఆదేశించారు. మంత్రి నారా లోకేశ్ ఆదేశాల మేరకు రైల్వే కోడూరు పోలీసులు బాలికల పాఠశాలను సందర్శించారు. అక్కడ విద్యార్థినులు, ఉపాధ్యాయులతో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మాట్లాడి సమస్యల గురించి వివరాలు సేకరించారు. విద్యార్థినులు ధైర్యంగా...