Warangal: యువతను మోసం చేసిన కాంగ్రెస్…జాబ్ క్యాలెండర్ ఎక్కడ?: ఏనుగుల రాకేష్ రెడ్డి
స్టార్ త్రినేత్రం, వరంగల్: ఎన్నికల ముందు యూత్ డిక్లరేషన్ పేరుతో యువతకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, వాటి అమలులో విఫలమైందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి విమర్శించారు. రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్, నెలకు రూ.4,000 నిరుద్యోగ భృతి వంటి హామీలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం కాకతీయ విశ్వవిద్యాలయంలో పర్యటించిన ఆయన విద్యార్థులు, నిరుద్యోగ యువతతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు....