STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 20 November 2026, 4:00 pm Posted by : ARUN

Samantha:మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత.. బాబు పేరు ఇదే!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు జీవితంలో సరికొత్త ఆనందం వెల్లివిరిసింది. సమంత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. నవంబర్ 19, 2026న తమకు కుమారుడు జన్మించినట్లు ఇన్ స్టా వేదికగా సమంత వెల్లడించింది.

ఈ సందర్భంగా తమ ముద్దుల కుమారుడి పేరును కూడా ప్రకటించింది. ‘దేవ్ నిడిమోరు’ (Dev Nidimoru) అని తమ బిడ్డకు నామకరణం చేసినట్లు తెలిపింది. సమంత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఫొటో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆ ఫొటోలో సమంత, రాజ్ తమ చేతులతో చిన్నారి చేతి వేళ్లను పట్టుకున్న దృశ్యం కనిపిస్తోంది.

మా అందమైన చిన్నారి దేవ్ నిడిమోరు.. 19.11.2026. మా హృదయాలు ఎన్నడూ లేనంత సంతోషంగా ఉన్నాయి అంటూ సమంత, రాజ్ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ బయటకు వచ్చిన వెంటనే అభిమానులు, సినీ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చిన్నారికి ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తున్నారు.

సమంత, రాజ్ నిడిమోరు 2025 డిసెంబర్ 1న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గతంలో ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌తో సమంత, రాజ్ నిడిమోరు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ‘సిటాడెల్: హనీ బన్నీ’ ప్రాజెక్ట్‌తో వీరిద్దరూ కలిసి పనిచేశారు. కొంతకాలం తమ బంధాన్ని ప్రైవేట్‌గా ఉంచిన ఈ జంట చివరకు పెళ్లితో ఒక్కటైంది.