Telangana: నిరుద్యోగులకు గుడ్న్యూస్..హోంగార్డు పోస్టులకు నోటిఫికేషన్!
తెలంగాణలో నిరుద్యోగ యువతకు పోలీస్ శాఖ మరో శుభవార్త అందించేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 2 వేల మంది హోంగార్డులను నియమించేందుకు పోలీస్ శాఖ కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు డీజీపీ సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో జరిగిన మినీ స్టాఫ్ ఆఫీసర్స్ సమావేశంలో హోంగార్డుల నియామక అంశంపై చర్చించారు. త్వరలోనే నియామక ప్రక్రియకు సంబంధించిన తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంది. రాష్ట్ర పోలీస్ శాఖలో సిబ్బంది అవసరాలు, పరిపాలనా సంస్కరణలు, సిబ్బంది సంక్షేమం తదితర అంశాలపై ఈ సమావేశంలో సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా...