Telangana: ఇకపై తెలంగాణలో ‘చెత్త’ పన్ను..!! 100 మందికి మించి దావత్ చేస్తే!
తెలంగాణలో చెత్త నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇకపై భారీ వేడుకలు, దావత్లు నిర్వహించే వారు ఉత్పత్తయ్యే చెత్తకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ముఖ్యంగా 100 మందికి మించి అతిథులతో వేడుకలు నిర్వహిస్తే ముందస్తు అనుమతి తీసుకోవడంతో పాటు ఆ కార్యక్రమంలో ఉత్పత్తయ్యే చెత్తకు కిలోకు రూ.3 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ జి. సృజన ఆదేశాలు జారీ చేశారు. సాధారణంగా పెళ్లిళ్లు, శుభకార్యాలు, పుట్టినరోజు వేడుకలు, ఇతర ఫంక్షన్లలో పెద్ద మొత్తంలో చెత్త ఉత్పత్తి...