Srisailam Temple: శివశక్తుల దివ్యక్షేత్రం.. శ్రీశైలం మల్లికార్జున స్వామి ప్రత్యేకతలు ఇవే!

శివశక్తుల దివ్యక్షేత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలంలో ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొలువై ఉంది. ఈ పవిత్ర క్షేత్రంను పరమశివుడు...పార్వతీదేవికి అంకితం చేశారని పురాణాలు చెబుతున్నాయి. దేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటిగా పద్దెనిమిది మహాశక్తి పీఠాలలో ఒకటిగా ఈ ఆలయం విశిష్టతను సంతరించుకుంది. ఒకే ప్రాంగణంలో జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఉండటం ఈ క్షేత్రం ప్రత్యేకత. మల్లికార్జున ఆలయంలో అప్పుడప్పుడు తేనెటీగల గుంపు చేసే సందడి వంటి శబ్దం వినిపిస్తుందని భక్తులు చెబుతుంటారు. దీనిని పార్వతీదేవి అవతారమైన భ్రమరాంబికాదేవి ఉనికికి ప్రతీకగా భావిస్తారు....