Rakesh Reddy: నిరుద్యోగ యువతకు అండగా రాకేశ్ రెడ్డి.. చట్టసభకు పంపితే మీ గౌరవాన్ని పెంచేలా పనిచేస్తా

స్టార్ త్రినేత్రం, వరంగల్: నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, ఎన్నికల సమయంలో ప్రకటించిన రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేశ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న యువతకు ప్రభుత్వం న్యాయం చేయాలని, లేనిపక్షంలో రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరుద్యోగ యువత తమ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి.. లేదంటే రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ప్రభుత్వానికి గుణపాఠం...