IND vs NZ: నికోల్స్, ఫిలిప్స్ విధ్వంసం.. అద్భుతంగా రాణించిన కివీస్!

భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్ అద్భుతంగా పుంజుకుంది. తొలి రోజు ఆటలో ఒక దశలో 70 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన కివీస్.. ఆ తర్వాత అద్భుత పోరాటంతో రోజును 5 వికెట్ల నష్టానికి 243 పరుగులతో ముగించింది. హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్ అజేయ శతక భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి ఆరో వికెట్‌కు అజేయంగా 173 పరుగులు జోడించారు. నికోల్స్ 113 పరుగులతో అజేయంగా నిలవగా.. ఫిలిప్స్ 94 పరుగులతో క్రీజులో ఉన్నాడు....