Delhi AQI: ఢిల్లీలో కాలుష్య నియంత్రణ… 17 వేలకుపైగా వాహనాలు సీజ్!
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. కాలుష్యానికి కారణమవుతున్న పాత వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టిన ఢిల్లీ పోలీసులు ఈ ఏడాది ఇప్పటివరకు 17 వేలకు పైగా వాహనాలను సీజ్ చేశారు. అంతేకాకుండా సరైన పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్లు లేని వాహనాలపై భారీగా జరిమానాలు విధించారు. ఈ ఏడాది ఇప్పటివరకు 17 వేలకు పైగా కాలపరిమితి ముగిసిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 16,918 ద్విచక్ర వాహనాలు ఉండగా 164 కార్లు ఉన్నాయి. మిగిలినవి త్రిచక్ర...