AP Politics: ఒకే కుటుంబంలో మూడు పదవులు.. భార్య ఎమ్మెల్యే, భర్త జెడ్పీటీసీ, తల్లి ఎంపీపీ!
ఆంధ్రప్రదేశ్లోని పోలవరం జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మూడు కీలక పదవులను దక్కించుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. రంపచోడవరం టీడీపీ ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి కుటుంబంలోనే ఎమ్మెల్యే, జెడ్పీటీసీ, ఎంపీపీ పదవులు ఉండటం విశేషంగా నిలిచింది. శిరీషాదేవి ఎమ్మెల్యేగా కొనసాగుతుండగా.. ఆమె భర్త విజయభాస్కర్ జెడ్పీటీసీగా, తల్లి కృష్ణవేణి ఎంపీపీగా ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో కృష్ణవేణి రాజవొమ్మంగి మండల పరిషత్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. అంతకుముందు జరిగిన స్థానిక ఎన్నికల్లో ఆమె తంటికొండ ఎంపీటీసీగా విజయం...