Alia Bhatt: రణబీర్‌తో పెళ్లిపై విమర్శలు.. అలియా భట్ తీవ్ర అసహనం!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్....నటుడు రణబీర్ కపూర్ వైవాహిక జీవితంపై వస్తున్న ఊహాగానాలపై స్పందించారు. తమ వివాహ బంధాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని అసలు వాస్తవాలు తెలుసుకోకుండా వ్యాఖ్యలు చేయడం తనను బాధిస్తోందని ఆమె అన్నారు. ముఖ్యంగా తమది అసమానమైన వివాహ బంధం అంటూ జరుగుతున్న ప్రచారంపై అలియా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 2022లో అలియా భట్, రణబీర్ కపూర్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అదే ఏడాది నవంబర్‌లో వీరికి కుమార్తె రాహా జన్మించింది. అయితే పెళ్లి తర్వాత...