Upasana Konidela: ప్రసవం తర్వాత డిప్రెషన్‌లోకి..ఉపాసన ఎమోషనల్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల ఎమోషనల్ అయ్యారు. తన రెండో గర్భధారణ సమయంలో ఎదుర్కొన్న కష్టాలను వెల్లడించారు. కవల పిల్లలకు జన్మనిచ్చే క్రమంలో తాను ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని తెలిపారు. ముఖ్యంగా ప్రసవం తర్వాత తీవ్ర ప్రసవానంతర డిప్రెషన్‌ బారిన పడ్డానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆ మానసిక వేదన నుంచి పూర్తిగా కోలుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తన మొదటి గర్భధారణతో పోలిస్తే...