Travel: ప్రపంచంలోనే అత్యంత వేడి ప్రదేశం.. ఒక్కసారి వెళ్తే!

అమెరికాలోని కాలిఫోర్నియా, నెవాడా రాష్ట్రాల సరిహద్దుల్లో విస్తరించి ఉన్న డెత్ వ్యాలీ నేషనల్ పార్క్ ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన పర్యాటక ప్రాంతాల్లో ఒకటి. అత్యధిక ఉష్ణోగ్రతలు, విశాలమైన ఎడారి ప్రాంతాలు, ఉప్పు మైదానాలు, మంచుతో కప్పుకున్న పర్వతాలు ఈ ప్రాంత ప్రత్యేకతలు. దాదాపు 1,000 మైళ్ల రహదారులు కలిగిన ఈ నేషనల్ పార్క్ ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకర్షిస్తోంది. డెత్ వ్యాలీ ఉత్తర అమెరికాలో అత్యంత పొడి ప్రాంతం కాగా, భూమిపై అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రదేశంగా గుర్తింపు పొందింది. వేసవిలో ఇక్కడ ఉష్ణోగ్రతలు...