Telangana Congress: మూడేళ్ల ప్రజాపాలన..రేవంత్ సర్కార్‌పై రోజురోజుకు పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత?
ఆరు గ్యారెంటీలు.. 420 హామీలు.. అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతామన్న కాంగ్రెస్ పార్టీ... మార్పు కావాలని కోరుకున్న ప్రజలు రేవంత్ రెడ్డికి అధికారం కట్టబెట్టారు. కానీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు, క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది. రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు, పేద కుటుంబాలు ఇలా అన్ని వర్గాల ప్రజల్లోనూ రేవంత్ సర్కార్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ముఖ్యంగా ఆరు గ్యారెంటీల అమలు, రైతు రుణమాఫీ,...