KTR: కాళేశ్వరం పేరు మారిస్తే.. కాంగ్రెస్ నేతల పేర్లతో ఉన్నవన్నీ మారుస్తాం!

కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మార్పు అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్షతో ప్రాజెక్టుల పేర్లు మార్చాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మార్చితే.. తాము అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ నాయకుల పేర్లతో ఉన్న అన్ని సంస్థలు, ప్రాజెక్టులు, ఇతర నిర్మాణాల పేర్లను మారుస్తామని స్పష్టం చేశారు. ఎయిర్‌పోర్టు, ఉప్పల్ స్టేడియం పేర్లను కూడా మారుస్తామని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాళేశ్వరం అనేది రాజకీయ నాయకుడి పేరు కాదని, ప్రాజెక్టులకు...