Komtireddy: రెండేళ్లే సీఎంగా ఉంటావ్..రేవంత్‌పై రాజగోపాల్ రెడ్డి సంచలనం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి పదవి అదృష్టం కొద్దీ వచ్చిందని ఇంకా రెండేళ్లు మాత్రమే అధికారంలో ఉంటావంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గం మునుగోడుతో పాటు కొడంగల్‌కు కూడా నిధులు కేటాయించాలని అడిగినందుకు తనను బెదిరిస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కొడంగల్‌కు మాత్రమే కాదు, మునుగోడుకు కూడా నిధులు ఇవ్వాలని అడిగినందుకు నన్ను పండబెట్టి తొక్కుతా...