Keesaragutta Temple: కీసర రామలింగేశ్వర స్వామి ఆలయం.. స్థలపురాణం, విశిష్టతలు ఇవే!
తెలంగాణలోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం ఒకటి. హైదరాబాద్కు సమీపంలోని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో కీసర ప్రాంతంలోని కొండపై ఈ పురాతన ఆలయం కొలువై ఉంది. ప్రకృతి అందాల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో వెలసిన ఈ క్షేత్రం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. ఇక్కడ స్వయంభూ శివలింగంగా శ్రీ రామలింగేశ్వర స్వామి భక్తుల పూజలు అందుకుంటున్నారు. అమ్మవారు భవానీ, శివదుర్గతో పాటు సీతారాములు, లక్ష్మీనరసింహ స్వామి విగ్రహాలు కూడా ఆలయంలో దర్శనమిస్తాయి. కీసరగుట్ట ఆలయానికి రామాయణంతో ముడిపడిన ప్రత్యేక స్థలపురాణం...