Cyclone Akvan: తీవ్ర తుపానుగా మారిన ‘అక్వాన్’..ఏపీకి పెను ముప్పు!

బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుపాను క్రమంగా బలపడుతూ తీవ్ర తుపానుగా మారింది. దీంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలకు ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. నవంబర్ 20న నెల్లూరు నుంచి విశాఖపట్నం మధ్య ఆంధ్రప్రదేశ్, యానాం తీరాలను తుపాను దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. తుపాను ప్రభావంతో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని తెలిపింది. బంగాళాఖాతంలోని దక్షిణ, పశ్చిమ మధ్య ప్రాంతాల్లో కొనసాగుతున్న అక్వాన్ తుపాను గత ఆరు గంటల్లో గంటకు సుమారు 3...