Trump: ప్రధాని మోదీపై ట్రంప్ ప్రశంసలు.. మోదీ చాలా కఠినమైన వ్యక్తి అంటూ కితాబు
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఫిలిప్పీన్స్లోని మనీలాలో ఆసియాన్ (ASEAN) సదస్సు సందర్భంగా క్వాడ్ (QUAD) దేశాల నేతలు మంగళవారం సమావేశమయ్యారు. ఈ భేటీలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. మోదీని కఠినమైన వ్యక్తి , గొప్ప నాయకుడు అంటూ అభివర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు గౌరవం ఉందని పేర్కొన్నారు. క్వాడ్ దేశాల నేతలతో కలిసి గ్రూప్ ఫొటో దిగే సమయంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. జపాన్ ప్రధాని సనే తకైచీని కూడా...