MS Dhoni: ఐపీఎల్‌కు ధోనీ గుడ్‌బై.. చెన్నై సూపర్ కింగ్స్ మెంటార్‌గా కొత్త బాధ్యతలు!
క్రికెట్ అభిమానులకు ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్. టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ ఆటగాడిగా తన సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు పలికాడు. దాదాపు రెండు దశాబ్దాల పాటు చెన్నై జట్టుతో కొనసాగిన ధోనీ.. ఇకపై కొత్త బాధ్యతల్లో కనిపించనున్నాడు. 2027 ఐపీఎల్ సీజన్ నుంచి సీఎస్‌కే జట్టు మెంటార్‌గా వ్యవహరించనున్నట్లు ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ధోనీ చెన్నై సూపర్ కింగ్స్‌తో ప్రత్యేక అనుబంధాన్ని కొనసాగించాడు. ధోని నాయకత్వంలో...