STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 17 November 2026, 3:57 pm Posted by : ARUN

MS Dhoni: ఐపీఎల్‌కు ధోనీ గుడ్‌బై.. చెన్నై సూపర్ కింగ్స్ మెంటార్‌గా కొత్త బాధ్యతలు!

క్రికెట్ అభిమానులకు ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్. టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ ఆటగాడిగా తన సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు పలికాడు. దాదాపు రెండు దశాబ్దాల పాటు చెన్నై జట్టుతో కొనసాగిన ధోనీ.. ఇకపై కొత్త బాధ్యతల్లో కనిపించనున్నాడు. 2027 ఐపీఎల్ సీజన్ నుంచి సీఎస్‌కే జట్టు మెంటార్‌గా వ్యవహరించనున్నట్లు ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది.

2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ధోనీ చెన్నై సూపర్ కింగ్స్‌తో ప్రత్యేక అనుబంధాన్ని కొనసాగించాడు. ధోని నాయకత్వంలో సీఎస్‌కే ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. అంతేకాకుండా రెండుసార్లు ఛాంపియన్స్ లీగ్ టీ20 టైటిళ్లను సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా ధోనీ నిలిచాడు.

సీఎస్‌కే యజమాని ఎన్. శ్రీనివాసన్ మాట్లాడుతూ.. ధోనీతో తమ అనుబంధం దాదాపు రెండు దశాబ్దాలుగా కొనసాగుతోందని తెలిపారు. 2008లోనే ధోనీని జట్టులోకి తీసుకోవాలని తాను పట్టుబట్టానని, అది తాను తీసుకున్న అత్యుత్తమ నిర్ణయాల్లో ఒకటని పేర్కొన్నారు.

ధోనీ తన ఐపీఎల్ కెరీర్‌లో సీఎస్‌కే తరఫున 272 మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం 5,314 పరుగులతో జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో రెండో స్థానంలో నిలిచాడు. ఇకపై మైదానంలో ధోనీ ఆటను చూడలేకపోయినా, అతడి అనుభవం, వ్యూహాలు, నాయకత్వ లక్షణాలు యువ ఆటగాళ్లకు ఎంతో ఉపయోగపడనున్నాయి.