Kavitha: విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటమా..?,ఇంటర్ బోర్డు రద్దు నిర్ణయంపై కవిత ఫైర్

55 ఏళ్లుగా కొనసాగుతున్న ఇంటర్మీడియట్ బోర్డును విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సంబంధిత వర్గాలతో సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా రద్దు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఇంటర్ బోర్డు రద్దు వల్ల ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థుల ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు దెబ్బతినే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. 'ఇంటర్ బోర్డు రద్దు – తెలంగాణ విద్యపై ప్రభావం' అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో...