Exam Cheating: మైక్రోచిప్స్,వాకీటాకీలు..పోటీ పరీక్షల్లో హైటెక్ కాపీ..గుట్టురట్టు!

పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడుతున్న ముఠాలపై జమ్మూకశ్మీర్ పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. అత్యాధునిక ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించి పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడేందుకు ప్రయత్నించిన ఓ ముఠా గుట్టును రట్టు చేశారు. చెవుల్లో కనిపించని చిన్న మైక్రోచిప్స్ అమర్చి, పరీక్షా కేంద్రాల బయట ఉన్న వ్యక్తుల నుంచి సమాధానాలు తెలుసుకునేలా పథకం రూపొందించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో మొత్తం 14 మందిని అరెస్టు చేశారు. జమ్మూకశ్మీర్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (JKSSB) నిర్వహించిన ఫైనాన్స్ అసిస్టెంట్ల పరీక్ష సందర్భంగా ఈ ఘటన...