Avengers Doomsday: భారత్‌లో ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ హవా.. బుకింగ్స్‌కు భారీ స్పందన!

ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హాలీవుడ్ చిత్రం ‘అవెంజర్స్: డూమ్స్‌డే’.ఈ సినిమా విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద సందడి మొదలైంది. ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొనగా.. భారతీయ ప్రేక్షకుల్లోనూ విపరీతమైన క్రేజ్ కనిపిస్తోంది. తాజాగా ఇండియాలో ఈ మూవీ అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ప్రారంభం కావడంతో అభిమానులు టికెట్ల కోసం పోటీపడుతున్నారు. సోషల్ మీడియాలో అభిమానులు పెద్ద ఎత్తున నిర్వహించిన #OpenDoomsdayBookings ప్రచారానికి స్పందనగా మార్వెల్ సంస్థ టికెట్ బుకింగ్ ప్రక్రియను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సమాచారం. బుకింగ్స్ ప్రారంభమైన కొద్దిసేపటికే...