Telangana Floksong: బన్నీ ‘బుట్టబొమ్మ’ రికార్డు బ్రేక్‌.. ‘రాను బొంబాయి’ సరికొత్త సంచలనం!

తెలంగాణ జానపద పాట మరోసారి తన సత్తా చాటింది. పల్లెపాటగా ప్రారంభమైన రాను బొంబాయి పాట యూట్యూబ్‌లో సరికొత్త రికార్డు సృష్టించి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. టాలీవుడ్‌లో అల్లు అర్జున్ నటించిన బుట్టబొమ్మ పాట నెలకొల్పిన రికార్డును ఈ తెలంగాణ ఫోక్ సాంగ్ అధిగమించింది. తక్కువ సమయంలోనే భారీ వ్యూస్ సాధిస్తూ జానపద సంగీతానికి ఉన్న ఆదరణను మరోసారి నిరూపించింది. రాను బొంబాయి పాట విడుదలైన ఏడాదిలోపే ఏకంగా 956 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించినట్లు తెలుస్తోంది. మరోవైపు అల్లు అర్జున్ నటించిన అల...