STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 16 November 2026, 3:59 pm Posted by : ARUN

Motorola: భారత్‌లోకి మరో కొత్త స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు లీక్!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటరోలా భారత మార్కెట్లో మరో కొత్త ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే పలు మోడళ్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న మోటరోలా.. త్వరలో Motorola Edge 70 Neo 5G స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుంది. తాజాగా ఈ ఫోన్‌కు సంబంధించిన లాంచ్ టీజర్‌ను కంపెనీ విడుదల చేసింది. ఈ ఫోన్ డిజైన్‌కు సంబంధించిన వివరాలు ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్‌లో వెల్లడయ్యాయి. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్‌పై టెక్ ప్రియుల్లో ఆసక్తి పెరిగింది.

మోటరోలా ఇండియా అధికారికంగా కొత్త స్మార్ట్‌ఫోన్ రాకను టీజ్ చేసింది. ఫ్లిప్‌కార్ట్‌లోనూ ఈ ఫోన్‌కు సంబంధించిన ప్రత్యేక పేజీ అందుబాటులోకి వచ్చింది. అందులో Your feed is about to enter a NEO era అనే ట్యాగ్‌లైన్ కనిపిస్తోంది. దీన్ని బట్టి ఇది మోటరోలా ఎడ్జ్ 70 నియో ఫోన్ అని స్పష్టమవుతోంది.

ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ URLలో నవంబర్ 26 తేదీ కనిపిస్తుండటంతో అదే రోజున ఈ ఫోన్ లాంచ్ కావచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే కంపెనీ ఇంకా అధికారికంగా లాంచ్ తేదీని ప్రకటించలేదు. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయానికి వచ్చే అవకాశం ఉంది.

ఈ ఫోన్ ఫీచర్స్‌ని పరిశీలిస్తే..ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ LYTIA సెన్సార్‌తో రానుంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), అల్ట్రా HDR సపోర్ట్ ఉండనున్నాయి. ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం హోల్ పంచ్ కెమెరా డిజైన్‌ను అందించనున్నారు.

– డిస్‌ప్లే: 6.78 అంగుళాల 1.5K OLED డిస్‌ప్లే
– రిఫ్రెష్ రేట్: 144Hz
– ప్రొటెక్షన్: కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i
– ప్రాసెసర్: క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 3
– ర్యామ్: 6GB, 8GB
– స్టోరేజ్: 128GB, 256GB
– మెయిన్ కెమెరా: 50MP సోనీ LYTIA సెన్సార్
– మాక్రో కెమెరా: 2MP
– సెల్ఫీ కెమెరా: 32MP
– బ్యాటరీ: 7,000mAh
– ఫాస్ట్ ఛార్జింగ్: 45W
– ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 16
– వాటర్ రెసిస్టెన్స్: IP64 రేటింగ్

ఈ ఫోన్‌లో 7,000mAh భారీ బ్యాటరీని అందించనున్నట్లు సమాచారం. దీనికి 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండనుంది. అలాగే నాలుగు సంవత్సరాల వరకు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌డేట్స్, ఐదేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందించే అవకాశం ఉంది. అయితే ఈ ఫీచర్లన్నీ అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.
అయితే ఈ ఫోన్‌ ధరపై ఎలాంటి స్పష్టత రాకపోయినా టెక్ నిపుణుల ప్రకారం భారత మార్కెట్లో ఈ ఫోన్ ధర రూ.30,000 నుంచి రూ.35,000 మధ్య ఉండే అవకాశం ఉందని అంచనా.